నీ కోసమే నే బ్రతుకుతానయా నా జీవితం నీ కోసమేనయా


Song no:
నీ కోసమే నే బ్రతుకుతానయా
నా జీవితం నీ కోసమేనయా
నా జీవితం నీకాకింతం
నీ సాక్షిగా ఇలలో జీవింతునయా

శోధన వేదనలు నన్ను చుట్టిన
వ్యాధులు బాధలు ఎదురొచ్చినా
విజయ శీలుడా నీవుండగా
నిరిక్షణతోనె ఇలసాగెదా

ఆత్మీయులే నన్ను అవమానించిన
అన్యులే నన్ను అపహసించిన
ఆదరణ కర్త నీవుండగా
ఆనందముతో నే సాగెదా

నా వారే నన్ను నిందించినా
బంధువులే నన్ను వెలివేసినా
నా పక్షమున నీవుండగా
సహనముతోనే ఇల సాగెదా