నా ప్రాణమా నా యేసుని మరువక స్తుతియించుమా


Song no:
నా ప్రాణమా నా యేసుని
మరువక స్తుతియించుమా
ఆయన చేసిన ఉపకారములను
ఆయన చేసిన మేలులన్నియు
మరువక స్తుతియించుమా
మనసున ధ్యానించుమా

మరణము నుండి నీ ప్రాణమును
విమోచించినాడు
కరుణ కటాక్షమును కిరీటముగా
నీపై యుంచినాడు
మేలులతోను నీ హృదయమును
తృప్తి పరచుచున్నాడు

నీ పాపమునకు ప్రతికారము
నీకు చేయలేదు
నీ దోషమునకు ప్రతిఫలమును
నీకు ఇయ్యలేదు
ఉన్నతమైన ఆయన కృపను
అధికముగా ఉంచినాడు

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం