దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది

    Song no: 18
    దేవా నీ ఆలయం
    ఎంతో ప్రియమైనది
    ప్రభు యేసుని నివాసము
    పరిశుద్ధులతో సహవాసము
    హల్లెలూయా పాడెదా
    ఆరాధన చేసేదా

    1. నీ మందిరము నుండుట
        ఎంతో భాగ్యము
        అతి పరిశుద్ధ స్ధలములు
        ఎంతో మనోహరము
        నీ మహిమ దిగివచ్చు ప్రతిక్షణం
        నీ ప్రేమ స్పందించు ప్రతి హృదిన్


    2. నీ మహిమ నిలుచు స్ధలం
        మాకెంతో క్షేమకరం
        నీ స్వరము వినుసమయం
        మాకెంతో ధన్యకరం
        దినదినము నీలోనే   
        ఫలియించుచు
        ప్రతి దినము నీలో 
        ఆనందించుచు

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం