మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ


Song no:
మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2||
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ ||2||
ఆరాధన  ఆరాధన  ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

 1. సమీపించరాని తేజస్సునందు వశియించు అమరుండవే
 శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే 

 2. ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే
 విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే 

3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే
 నీ గుణాతిశయములు ధర నే ప్రచురింప ఏర్పరచుకొంటివే

4. రాజులైన యాజక సమూహముగా ఏర్పచబడిన వంశమై
 పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే 

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం