ఈ జీవితం విలువైనది నరులార


Song no: o
జీవితం విలువైనది నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు 
కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు


About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం