బాలకుల విన్నపము లాలించు

535

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ పోషకా||

  1. బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ బ్రోవుమా||

  2. మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా యందు జూపుమా||

  3. చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ మరువనీకుమీ||

  4. ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు మఖిలకాలము||

  5. పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ జేర గరుణజూపుము ||

Post a Comment

కొత్తది పాతది