జయం జయం హల్లెలూయ జయం జయ

534

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు నామమునకు జయం జయ మిప్పుడే ||జయం||

  1. ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||

  2. ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి యేసు ప్రభు వాయనే ||జయం||

  3. రేపు అను చింతలను బాపి యేసు నమ్ముడీ రూపు మాపు అనక యేసు దాపు జేరు డిప్పుడే ||జయం||

Post a Comment

కొత్తది పాతది