బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా

528

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకు బలు కీడు లకునదె మూలమనిగమనింపరా ||బాలకా||

  1. తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుడు పడిన తిప్పలు నీ వెఱుగవా? ||బాలకా||

  2. గోలచేయుచు బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||

  3. పరులకెగ్గొనరింపబోకుము దొరలునదినీ మీదనే పరునికై హామాను నిల్పిన కొఱత నతడే వ్రేలడే ||బాలకా||

  4. కట్టడి కార్యంబుతుదకు బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా||

  5. వగవకుము పరధనముగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా||

  6. ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన యాలితో సహకూలడే ||బాలకా||

  7. కోపమునకాన్పదమునీయ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా||

  8. తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల సాంగత్యమున రెహ బాము భంగము నొందడే ||బాలకా||

  9. బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా||

Post a Comment

కొత్తది పాతది