యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన

594

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసు||

  1. భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా ప్రియమొప్పగతాను ||యేసు||

  2. గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసు||

  3. పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసు||

  4. కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా ||యేసు||

  5. చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి భక్తిని చూపిరి సాగుచు జనులంతా ||యేసు||

  6. యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం దేవాలయమును పరిశుభ్రత చేసె ||యేసు||

  7. మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు గల్గించియు మరి ననయము బ్రోచునిలన్ ||యేసు||

Post a Comment

కొత్తది పాతది