యేసువ జయముతో యెరుషలేమున

593

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||

  1. మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణకువ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||

  2. పిల్లలు పెద్దలు పలుకేకలతో బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||

  3. కొందరు వారిని తొందర జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||

  4. యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||

  5. మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||

  6. మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కగ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||

Post a Comment

కొత్తది పాతది