మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు

595

రాగం - మోహన
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు
దినంబు మహిమాన్వితంబు
అనంతజగతీమనోహ రంబు } 2
ఘనాదిప్రభుయశః ప్రకాశంబు } 2 ||మనో||

  • మందమారుతములందము నొసగగ
    డెందములకు నానందము నిడగా } 2
    సుందర పక్షుల సుమధురగానము } 2
    సుఖావహంబై శోభించెనుగా } 2 ||మనో||

  • అరుణభాస్కరుని కిరణాకరము } 2
    ధరదిక్తటముల దరిజేరెనుగా } 2
    ధరావలయమాఖరభానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||

  • పులుగిల కిలకిల కలరవములతో
    పొందుగ గలసిన భూరి రవంబు } 2
    లలితమనోహరశ్రావ్యమ వినుమా } 2
    తలపన్ దానికి కారణమేమో } 2
    ||మనో||

  • రయమున నొలీవ నగంబుగనుమా } 2
    రభసయుక్తమగు జనమును గనుమా } 2
    జయంజయంబను జయ ధ్యానంబులు } 2
    వియదంతము జనమ్రోగుట వినుమా ||మనో||

  • ప్రసన్నవదనుడు భానుతేజుడు } 2
    అసంఖ్యజనగణ పరివృతబలుడు } 2
    ప్రసితరాసభాసీనుడు యేసుడు } 2
    అసమ శాంతితో నరుదెంచెనహో ||మనో||

  • జయములు బాడెడు బాల చయముతో
    సాత్వికుడై రాసభంబు నెక్కి } 2
    జయోత్సవంబుతో సర్వేశ్వరుడు } 2
    చనిహృదయము సమర్పించె దము } 2 ||మనో||