680
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే పరిశుద్ధనామం ||మన||
- మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు నెమ్మది నిచ్చున్ ||మ||
- పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి మధురం పరిశుద్ధ రుధిరం ||మ||
- జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ||
- అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే ||మ||
- యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే మా ప్రధానధ్యేయం ||మ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి