హోమ్Purushotthamu.C 292 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట నిజముగా పరిశుద్ధు డొక డీ నేలపై లేడు వృజినములచే జెడిన మదిని బ విత్రమూలం బెటుల బొడమును ||నిజము||దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దాని గూడిన నరులలో బరిశుద్ధ విధు లె న్నటికి గనరావు నెరవుగా సద్ధర్మములనే తెఱగునను గావింప నేర్తురు ధరణి లోపల ముసిడి చెట్టున చెఱకు రస ముండునె తలంపగ ||నిజము||మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండగ ఘనతగల సత్యార్య ముల నిల మనుజుడె ట్లొ నరింపజాలును ||నిజము||నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ ధర్మము భక్తి ఎటువలె బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లే డని నిక్కముగ గనపచ్చుచున్నది పరమ దేవుడు క్రీస్తు కృతమున పాపులను రక్షింపవలయును ||నిజము|| ✍ పురుషోత్తము చౌధరి Nijamugaa Parisudhdhu Dokadee - Nelapai Ledu = Vrujina Mulache Chedina Madhini Pa – Vithra Muulam Betula Bodamunu || Nijamuga || Dhuritha Lathalaku Muula Kandhamu – Dhusvabhaavamu Dhaani Guudina – Narulaloapari Sudhdha Vidhu Le- Nnatiki Ganaraavu = Neravugaa Sadhdhrmamulane Theragu Nanu Gaavimpa Nerthuru – Dharani Loapala Musidi Chettuna – Cheraku Rasa Mundane Thalampaga || Nijamuga || Manasu Kriya Lannitiki Muulam – Anuchu Saasthramu Palku Mari Yaa Manasu Suchikaanunna Nagune – Thanaku Kriyaa Sudhdhi = Anisa Maa Hrudhayamu Dhurichchala – Nalari Midhyaasakthi Nundaga – Ghanatha Gala Sathkaarya Mula Nila – Manuju Detlonarimpa Jaalunu || Nijamuga || Nirathamunu Paapaagni Chethanu – Garagu Chunna Manambu Loapala – Paramadharmamu Bhakthi Eatuvale – Baadhukoni Yundun = Nirapa Raadhi Yokandu Ledani – Nikkamuga Gana Vachchu Chunnadhi – Parama Dhevudu Kreesthu Kruthamuna Paapulanu Rakshimpa Valayunu || Nijamuga || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి