Song no: యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగొనియున్నది నా హృదయం || యేసయ్య || ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో నీలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగొనియున్నది నా హృదయం || యేసయ్య || యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో నీలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగినియున్నది నా హృదయం || యేసయ్య ||
Social Plugin