Song no:
- కృంగిపోకు నేస్తమా
- శూన్యమైన సృష్ఠినే చూడకుండెనా
ఆకారం లేనిదనీ ఆదమరిచెనా
చీకటి కమ్మెననీ చూడకుండెనా
వెలుగు కలుగుగాక అనీ పలుకకుండెనా
మరిచెనా లేక మంచిదిగా మలిచెనా ॥2॥
మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
అందుకే || కృంగిపోకు ||
- యేసేపు అన్నలే తోసేసినా
బాషరాని దేశానికి అమ్మేసినా
బానిసైన బాధ్యతగా పనిచేసినా
బాధితునిగా చేసి బంధించినా
మరిచెనా లేక మంత్రినే చేసెనా ॥2॥
మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥
అందుకే || కృంగిపోకు ||
మంచిరోజు నీకుంది సుమా
మారదీ తలరాతని మనసు రానీకుమా
మంచిరోజులోస్తాయమ్మా
మరువనీడు నీదేవుడమ్మా
ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా
తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా || కృంగిపోకు ||