నా యేసు నాదు ప్రాణమా... ఆ... ఆ... 2
నాకున్న బలమా... నాకున్న జ్ఞానమా... 2
నా యేసు నాదు జీవమా...
నా యేసు నాదు సర్వమా... ఆ... ఆ... 2
1 ఒక్క క్షణమైన జీవించలేను
నీవు లేకుండా నా జీవితాన
అణుమాత్రమైన నొప్పించని
నీ ప్రేమతోనే ప్రేమించినావు... 2
నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు
నిజమైన దేవుడా నా సహయమా... 2
నిన్నే పూజింతును... పూజార్హుడా... || నీ పాద సన్నిధి ||
2 ఐశ్వర్యము కంటే సిరిసంపద కంటే
నీ దయ ఎంతో కోరదగినది
నా జ్ఞానము కంటే నా తలంపు కంటే
నీ ఆలోచన ఎంతో స్థిరమైనది... 2
నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు
నిజమైన దేవుడా నా సహాయమా... 2
ఆరాధింతును... ఆరాధ్యుడా... || నీ పాద సన్నిధి ||
0 కామెంట్‌లు