గంతులు వేసి - గానము చేసి
నిన్నారాధింతును ... నేనారాధింతును
1. నక్షత్రములు నిను స్తుతియించ - ఆకాశాన్ని వెలిగించునట్లు
పారె సెలయేరు నిను స్తుతియించ - దప్పిక తీర్చి జీవమిచ్చునట్లు
నా దేహమును సజీవ యాగముగా నీకర్పించి స్తుతియింతును
నిన్నారాధింతును ... నేనారాధింతును
2. మేఘములు నిను స్తుతియించ - ఎండిన భూమిని పండించునట్లు
ఎగిరే పక్షులు నిను స్తుతియించ - నీదు ప్రేమను చాటించునట్లు
నిన్ను ఘన పరచి నన్ను మైమరచి నిన్నే నేను స్తుతియింతును
నిన్నారాధింతును ... నేనారాధింతును
3. పరిశుద్ధులు దూతగణములు - సదా నిన్ను స్తుతియించునట్లు
చెరూబులు సెరాపులు - సదా నిన్ను స్తోత్రించునట్లు
అద్వితీయుడనీ పరిశుద్ధుడు నీవని, నిన్నే నేను స్తుతియింతును
నిన్నారాధింతును ... నేనారాధింతును