512
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||
- మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్ ||స్వతంత్ర||
- సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్ ||స్వతంత్ర||
- నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||
- జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్ ||స్వతంత్ర||
కామెంట్‌ను పోస్ట్ చేయండి