510
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము ||దేవ||
- పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు పురము ||దేవ||
- ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము ||దేవ||
- శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల భాసురము ||దేవ||
- వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము ||దేవ||
- కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే సుస్థిరము ||దేవ||
- క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు దుస్తరము ||దేవ||
- ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము ||దేవ||
- మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము ||దేవ||
- సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురము గావించు గరము ||దేవ||
- సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి సంపత్కరము ||దేవ||
- ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు మా పురము ||దేవ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి