596
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము ||సిలువే||
- చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే||
- పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా ||సిలువే||
- రంగొప్ప దీని ప్రసంగము మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ భృంగము రక్షశృంగము పాపభంగము మహా ||సిలువే||
- భయములేదని చాటుచున్నది ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా ||సిలువే||
- చేరవచ్చిన వారి భారము ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ సారము సువిచారము సదాచారము మహా ||సిలువే||
- ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా పానము దూతగానము తేజోమానము మహా ||సిలువే||
- ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే రక్షణ కనుగొంటిమి కన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి