676
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
- పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
- జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
- నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి