చక్కని పరలోక సంబంధులతో గూడి

509

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||

  1. నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||

  2. పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను మీరగ భక్తశ్రేష్ఠులతోగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని||

  3. పరిశుద్ధదూతలతో ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో పరిపూర్ణులతో గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో ||చక్కని||

  4. మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో ||చక్కని||

  5. పాపశరీరము బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప మరణ దుఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని||

  6. రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||

Post a Comment

కొత్తది పాతది