ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన

549

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

  1. పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము ||ఏ||

  2. బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల ప్రయాసపడుదము ||ఏ||

Post a Comment

కొత్తది పాతది