శ్రీ యేసుండు జన్మించె రేయిలో

601

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఏక

    శ్రీ యేసుండు జన్మించె రేయిలో } 2
    నేడు పాయక బెత్లెహేము ఊరిలో } 2 || శ్రీ యేసుండు ||

  1. కన్నియ మరియమ్మ గర్భమందున } 2
    ఇమ్మానుయేలనెడి నామమందున } 2 || శ్రీ యేసుండు ||

  2. సత్రమందున పశువులశాల యందున } 2
    దేవపుత్రుండు మనుజుండాయెనందునా } 2 || శ్రీ యేసుండు ||

  3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి } 2
    పశుల తొట్టిలో పరుండ బెట్టబడి } 2 || శ్రీ యేసుండు ||

  4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా } 2
    దెల్పె గొప్ప వార్త దూత చల్లగా } 2 || శ్రీ యేసుండు ||

  5. మన కొరకొక్క శిశువు పుట్టెను } 2
    ధరను మన దోషములబోగొట్టెను } 2 || శ్రీ యేసుండు ||

  6. పరలోకపు సైన్యంబు గూడెను } 2
    మింట వర రక్షకుని గూర్చి పాడెను } 2 || శ్రీ యేసుండు ||

  7. అక్షయుండగు యేసు పుట్టెను } 2
    మనకు రక్షణంబు సిద్ధపరచెను } 2 || శ్రీ యేసుండు ||


    Sri Yesundu Janminche Reyilo } 2
    Nedu Paayaka Bethlehemu Oorilo } 2 || Sri Yesundu ||

  1. Kanniya Mariyamma Garbhamanduna } 2
    Immaanuyelanedi Naamamandunaa } 2 || Sri Yesundu ||

  2. Sathramanduna Pashuvulashaala Yanduna } 2
    Devaputhrundu Manujundaayenandunaa } 2 || Sri Yesundu ||

  3. Mana Koraku Oka Shishuvu Puttenu } 2
    Dharanu Mana Doshamulabogettenu } 2 || Sri Yesundu ||

  4. Gollalellaru Migula Bheethillagaa } 2
    Thelpe Goppa Vaartha Dootha Challaga } 2 || Sri Yesundu ||

  5. Akshayundagu Yesu Puttenu } 2
    Manaku Rakshanambu Sidhdhaparachenu } 2 || Sri Yesundu ||

Post a Comment

కొత్తది పాతది