హోమ్Purushotthamu.C 224 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుడి మోక్ష సదనమున కేను బోదు సంతోషించు(డి ||ఇదిగో||యెరూషలేమందుండి మీ రెదురు చూడుడి మీపై బరిశుద్ధాత్మయు దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో||దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండ బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ||నిదిగో||ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుడి ||యిదిగో||ఏదైననా పేరిటమీ రించుక వేడినను మీకు మోదముతోడదాని ముందే చేయుదును ||ఇదిగో||ఉల్లము లందు గలత లెల్ల విడువుడి నేను మళ్లి వచ్చెడి విధము మరువకుండుడి ||యిదిగో|| ✍ పురుషోత్తము చౌధరి Edhigo Naa Sishyulaaraa – Yeruka Lunchudi = Moaksha Sadhanamuna Kenu Boadhu – Santhoashinchudi || Edhigo || Yeruushalemandhundi Mee – Redhuru Chuududi – Mee Pai Pari Sudhdhaathmayu Dhigivachchi – Panulu Thelpunu || Edhigo || Dhikkulenatlu Mimma Dhiga Naadi Poanu = Meethoa Makkuvai Yunda Parisu –Dhdhaathmanu Pampedhanu || Edhigo || Niryaanamuna Mee Korakai Nelavulu Kalpinthu = Naathoa – Sarva Kaalamu Nithya – Saamraajyamu Nela || Nidhigo || Okarithoa Nokaru Priyamu Loppi Yundudi= Naadhu – Sakalaa Jnalandhu Nidhiye – Saaramanu Konudi || Edhigo || Edhainaa Naa Perita Mee – Rinchuka Vedinanu = Meeku – Moadhamu Thoada Dhaani –Mundhe Cheyudhunu || Edhigo || Ullamu Landhu Galatha – Lella Viduvudi = Nenu – Malli Vachchedi Vidhamu – Maruvakundudi || Edhigo || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి