హోమ్Purushotthamu.C 215 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి||సుదతులార||ఇచట లేడు లేచి యున్నాడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుడై ప్రచురంబుగ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||మనుజ కుమారు డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పై దనకు దానె మూడవ దినమందు లేచుట యును దెల్పె గద మీరు వినుచుండగ దొల్లి ||సుదతులార||ఎదలలోన జ్ఞాప కము చేసికొనుడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవము గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగ దోచ ||సుదతులార|| ✍ పురుషోత్తము చౌధరి Sudhathulaara Mee –Richchoata Nevvari– Vedhakuchu Nunnaaru = Mrudhuvu Gaanu – Jee – Vinchu Vaani Pedhdha – Nidhura Boayi Natu Ledhalandhu Bhaavinchi || Sudhathulaara || Eichata Ledu Lechi – Yunnaadu Prabhu Kreesthu – Yesu Svathanthrudai = Prachurambuga Thana – Paatlu Lechutayunu – Vachiyinche Galilayya – Vara Dhesamuna Meethoa || Sudhathulaara || Manuja Kumaaru De –Kkudu Paapishtula Chetha – Marana Mondhuta Silva Pai = Thanaku Apa Muudava– Dhinamandhu Lechuta - Yunu Dhelpe Gadha Meeru – Vinuchundaga Tholli || Sudhathulaara || Edhalaloana Jnaapa – Kamu Chesikonu Dinka – Yesu Thelipina Maatalu = Mudhamuthoa Jeevamu – Apa Leche Nanu Vaartha – Sudhathu Laalakinchi – Radhi Nikkamuga Thoacha || Sudhathulaara || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి