హోమ్Purushotthamu.C 154 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు|| ✍ పురుషోత్తము చౌధరి Eavaru Bhaaghya Vanthu Loudhu – Ravani Loapala = Moaksha – Vivaramaiana Kreesthu Boadha – Chevuloggi Vinu Vaari Kanna Eavaru Bhaaghya Vanthu 1. Kavulu Laabha Marasi Cheyu – Kapata Manthramul = Vidhulu – Dhavula Boava Tharimi Yesu - Thathvamu Gonu Vaari Kanna Eavaru Bhaaghya Vanthu Dheena Maanasula Kitti Yupa – Dhesa Michchenu = Dhivya Maina Moaksha Raajyamu Vaari Dhounatanchu – Prabhuvu Thelipe Eavaru Bhaaghya Vanthu 3. Vrujinamulakai Dhukkinchedi – Sujanu Lrevvaroa = Vaaru Nijamuga Noadhaarpu Bondhi Nithya Santhoashithu Lani Thelipe Eavaru Bhaaghya Vanthu 4. Saanthi Neethi Karuna Yandhaa – Sakthi Gala Vaaru = Bhuu Svathanthrulai Pari Thrupthi Nondhi – Dhaya Bada Sedha Rani Prabhuvu Thelipe Eavaru Bhaaghya Vanthu 5. Parisudhdha Hrudhayamulu Paraa – Thparuni Chuuthuru = Sarva – Narula Samaadhaana Parachu – Narule Parama Janakuni Suthulu Eavaru Bhaaghya Vanthu 6. Neethi Koraku Aapadha Nondhedi – Nischalaathmulu = Vaaru – Khyaathiga Paraloaka Raajya – Ghana Soukhyamu Lellanu Badayudhuru Eavaru Bhaaghya Vanthu || Eavaru || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి