హోమ్Purushotthamu.C 155 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద ||వినరయ్య||పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్ ||వినరయ్య||భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్ ||వినరయ్య||అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య||మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య||తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్ ||వినరయ్య|| ✍ పురుషోత్తము చౌధరి Vinarayya Narulaaraa – Visvaasamuna Kreesthu – Vimala Boadha = Paapa Manujula Kella Paa – Vana Jeevanamu Seyu – Vasudh Meedha || Vinarayya || Paapaathmulanu Paschaa-Ththaapamu Padudanchu – Prabhuvu Thelpen = Thana – Dhaapu Goarina Vaari – Kaapaadutaku Thaane || Vinarayya || Bhaaraa Kraanthulaina – Paapula – Thanu Jera – Prabhu Vu Pilchen = Sramalu – Dhuurambu Jesi Tha – Dhdhuritha Mul Baapi Sam – Thoasha Miyyan || Vinarayya || Anumaanimpaka Nevva– Raina Vachchina Throaya – Nanu Chu Palken = Pekku – Manujula Koraku Jee – Vana Miyya Ne Vachchi – Thanuchu Thelpen || Vinarayya || Manasaara Dhevunin– Maanaka Premim Pu – Manuchu Nerpen = Einka Thana Poalke – Norulanu Thaanu Premimpaga Dhanara Thelpen || Vinarayya || Thana Sishyulaku Naikhya– Munu Preminchuta Kaajna – Lonara Nichche =Nenthoa– Ghana Sathprabhuvu Kaallu – Kadigi Bhakthula Choata – Vinathu Dayyen || Vinarayya || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి