హోమ్B.John 113 byOnline Lyrics List —నవంబర్ 04, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతో||అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతో||కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతో||మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్ను లాస దీరె ||సంతో||ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతో||పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతో|| ✍ బేతాళ జాన్ Santhoashinchudi andharu naathoa - santhoa shinchandi = oka vinthayagu kiirthana paada vacchithini - santhoashinchandi – naathaoa Santhoashinchudi 1 Andhakaara mayamaina bhuumi naa-dhyanthamu veligimpa – dhaani yaa – vesamu dolagimpa = vandhi thundu kriisthesu naadhudu – vacche prakaasunDai –bhuumiki nicche prakaasambu Santhoashinchudi 2 Kaana nandhakaarambu dholaga pra-kaasinchenu lendu – miiru pra – kaasimpanurandu – maanavula nu santhoasha parachanai – mahini avatha rinche – bhakthula manamu santha sinche Santhoashinchudi 3 Minnu nundi santhoashoadhayamu – migula prakaa sinche –hrudhayamula –dhagulaprakaasinche = munnu ceya badina vaagdhatthamu - thinnaga neravere bhakthula kannulaasa dhiire Santhoashinchudi 4 Priithi yaina yii panduga guurchi – nuuthana kiirthananu – kalasikoni naathoapaaduchunu = nii thari dhuurastula kii vaarthanu – ye tiiruna naina – thelupaga naathura padavalenu Santhoashinchudi 5 Paapulapai dhevuniki kaligina –prabalamaina dhayanu – loakamuna – chuupimpagavalenu-= chuupaka poayina loapamu manapai moapabadunu nijamu – vegamu – chuupudh maa padhamu || yanni || ✍ Bethala John akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి