శీర్షిక లేదు

రాగం - కురంజి
తాళం - ఆది
    దేవర బ్రోవుమా దీన కుటుంబమున్
    దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర||

  1. పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||

  2. యేసు ప్రభువ మా యింటికి శిరసుపై
    వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||

  3. అనుదిన భోజనం బనుగ్రహించి మా
    పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||

  4. పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో
    నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||

  5. అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్
    గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||

  6. నీ పరిశుద్ధత నేర్పుము యేసువ
    కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||

  7. క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు
    ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర||

    ✍ చెట్టి భానుమూర్తి

ttt akk 514

Post a Comment

కొత్తది పాతది