الصفحة الرئيسيةAKK📖 రారే మన యేసు స్వామిని జూతము byOnline Lyrics List —أكتوبر 21, 2024 0 514 క్రీస్తును చూడ రండి రాగం - శంకరాభరణము తాళం - ఆది Song no: #83 రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే|| పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే|| తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే|| ✍ పురుషోత్తము చౌధరి Raare Mana Yesu Swaamini Joothamu Korke – Loora Priyulaaraa Permini Goorimi Bhakthula Jeruva Vindata Bhoorida Yaamrutha Saaramu Lolikedu Chaaru Kataaksha Vi – shaalekshanudata Naarakulagu Nara – Naaree Janulaku Daaraka Mosaganu Daane Pilachunata Daaruna Paapa Ma-haaranyamunaku Gaaru Chichchu Gathi Ganpaduvaadata Ghora Daridratha Goolchedi Vaadata Saarambagu Thana Sabhaku Makutamata || Raare || Pathitha Paavanamou Velpata Anaadi Deva Suthudai – Ila Jerinaadata Sathathamu Kadu Duri – Thathamoyuthamagu Prathi Deshamunaku – Hitha Bhaaskarudata Athulitha Moksho – nnatha Gunaganudata Kuthalambuna Sa-dgathi Rahithambagu Pathithula Gaavanu – Mruthudainaadata Athi Punya Thanu – Kshatha Shonithamunu Vrathamuga Siluvanu Nathadosangenata Mruthini Jayinchuchu Brathiki Lechenata Mathi Nammina Mana Gathi Yithadenata || Raare || Thudaleni Mahima Vaadata Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata Chedarina Gorrela – Vedaka Vachchenata Chidurupalagu Jana Hrudayamulannita Badilamugaa Ne-mmadi Niduvaadata Nadithata Mata Jana Vadanamula Sa mmadha Shubhavaarthanu – Balikinavaadata Sadayatha Sandhula – Kakshula Nidenata Vedaki Badhirulaku – Veenulosage Nata Sadamala Moksha Prabhudagu Vibhudata Yidigo Manakitha Delinavaadata || Raare || ✍ Purushottam Chowdhary akk 83 أحدث أقدم