Yesuni namamulo manabadhalu povunu యేసుని నామములో మన బాధలు పోవును

Song no:

Jesus Christ is the LORD of all
Jesus Christ is the Prince of Peace
Jesus Christ is the Mighty GOD
Let us come and sing and praise the LORD

యేసుని నామములో - మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును

ఘోరమైన వ్యాధులెన్నైనా - మార్పులేని వ్యసనపరులైనా
ఆధికముగా లోటులెన్నునా -ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో - నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు
యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు - ప్రతి సమయమునా జయమే

యేసుని నామములో - మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును

Jesus Christ is the LORD of all
Jesus Christ is the Prince of Peace
Jesus Christ is the Mighty GOD
Let us come and sing and praise the LORD

రాజువైనా యాజకుడవైనా- నిరుపేదవైనాబ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా - నిలువనీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున - విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా - నిత్యజీవము పొందెదవు

أحدث أقدم