(రాగం : ముఖరి )
(ఛాయ : హృదయమనెడు తలుపునొద్ద )
song 228
నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు
క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట ||
నాఁడు||
1.
మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు
గుండె దిగులుగా ||
నాఁడు||
2.
దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా
||
నాఁడు||
3.
ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి
హెచ్చఁగా ||
నాఁడు||
4.
కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో
వచ్చెఁగా ||
నాఁడు||
5.
దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ
బోయి చెడితిమి ||
నాఁడు||
6.
వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ
బడఁబాలైతిమి ||
నాఁడు||