నీ వల్లనే నా క్షేమము అభివృద్ధి అగుచున్నది నా యేసయ్యా

నీ వల్లనే నా క్షేమము అభివృద్ధి అగుచున్నది
నా యేసయ్యా..
నీ వల్లనే నా జీవితం (2)
బహుగా దీవించబడుతున్నది (3)
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... (2) || నీ వల్లనే ||

1️⃣. ఫలించెడి ద్రాక్షావల్లి నీవై యుండి
నీలోని తీగెగా నను అంటు కట్టితివి (2)
నిను అంటి యుండుట వలనే
నాకు ఫలియింపు వచ్చెను (2)
నీకు వేరైతే నేను జీవించలేను (2) || యేసయ్యా ||

2️⃣. జీవజలపు ఊటవైన నీయందు నన్ను
మొక్కవలె నాటితివి నా యేసయ్యా (2)
నీ వాక్య జలములతోనే
అనుదినము బ్రతికించితివి (2)
నీ సత్యమునకు నన్ను సాక్షిగా నిలిపితివి (2) || యేసయ్యా ||

3️⃣. ఎండిన ఎడారి వంటి నా బ్రతుకు నందు జీవజలపు నదిగా నీవు ప్రవహించినావు (2)
నీ సిలువ రక్తము చేత
నను కడిగి శుద్దుని చేసి (2)
పరిశుద్ధ ఆత్మతో నింపి ఫలియింప జేసితివి (2) || యేసయ్యా ||

Post a Comment

కొత్తది పాతది