నా కేడెమా నా దుర్గమా నా యేసయ్యా నా రక్షకా

నా కేడెమా నా దుర్గమా (2)
నా యేసయ్యా నా రక్షకా (2)
నిన్నే ఘనపరతును
నిన్నే ఆరాధింతున్ (2) || నే సిద్ధపడి ||

1️⃣. తల్లి గర్భమునుండి కాచిన దేవా
నా తండ్రి నీవై బలపరచినావా (2)
నీ కార్యములు గంభీరములు (2)
నా కనులకే ఆశ్చర్యములు (2) || నే సిద్ధపడి ||

2️⃣. నా శత్రువులు నను చుట్టగను
నా నోరు నిన్నే స్తుతియింపగను (2)
యెరికో గోడలు కూలిపోయెగా (2)
శత్రు సైన్యము పారిపోయెగా (2) || నే సిద్ధపడి ||

3️⃣. పరలోక మార్గము చూపిన దేవా
నా నీతి రక్షణ నీవైనావా (2)
ఏ హృదయమైతే నీ వైపు తిరుగునో (2)
నూతన సృష్టిగా మార్చగలవు (2) || నే సిద్ధపడి ||

(నా కేడెమా)

Post a Comment

కొత్తది పాతది