స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా

    స్తుతి సింహాసనాసీనుడా – నా ఆరాధనకు పాత్రుడా (2)
    నీవేగా నా దైవము – యుగయుగాలు నే పాడెదన్ (2) || స్తుతి ||

  1. నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
    నీ కోసమే – నీ కృప కోసమే (2)
    నీ సముఖములో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) || స్తుతి ||

  2. నీ సేవలోనే తరియించాలని – నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
    నీ కోసమే – నీ కృప కోసమే (2)
    నీ నీడలో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) || స్తుతి ||

  3. నా ఆశయముతో నా కోరికతో – నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
    నీ కోసమే – నీ కృప కోసమే (2)
    నీ వెలుగులో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) || స్తుతి ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు