వెండి బంగారములకన్న

688

    వెండి బంగారములకన్న
    యేసుని కలిగి యుండెదమ
    వెలగల భూషణములకన్న
    కల్వరి సిల్వ ధరించెదము

  1. అడవిరాజు తన పిల్లలను
    లేమికలిగి ఆకలిగొనును
    దేవుని ఆశ్రిత జనులకు ఎపుడు
    మేలులు కొదువై యుండవుగా

  2. మన ప్రభుండు మహదేవుండు
    ఘన మహాత్యము గలరాజు
    రక్షణకర్త ప్రధాన కాపరి
    ఆయన మేపెడి గొర్రెలము

  3. వారి గుర్రములు రధములను
    బట్టి జనులు గర్వించెదరు
    మనమైతే మనదేవుని నీతి
    న్యాయములను శ్లాఘించెదము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు