దీవించు దేవా నీ బిడ్డలను

568

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప ||దీవించు||

  1. నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి జీవింపగ ||దీవించు||

  2. సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా క్కులను బలుక ||దీవించు||

  3. భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ పూజసల్పుచు బిలువ ||దీవించు||

  4. ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి ప్రేమింప ||దీవించు||

  5. అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల నొంద ||దీవించు||

  6. క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర లందరి కొసగి ||దీవించు||

  7. ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు సాక్ష్యము నియ్య ||దీవించు||

Post a Comment

కొత్తది పాతది