ఒక్క మనుజు డెరుషలేమునుండి

541

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||

  1. మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||

  2. అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె వాని నాదరింపక ||ఒక్క||

  3. వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి పోయె గరుణలేకను ||ఒక్క||

  4. పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి గరుణతోడ భేదమొంచక ||ఒక్క||

  5. నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||

  6. అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను జూచి యాదరింపవలయును ||ఒక్క||

Post a Comment

కొత్తది పాతది