తండ్రి వంటివాడు మనకు ధరణిని

544

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    తండ్రి వంటివాడు మనకు ధరణిని బోషించువాడు దండ్రి ప్రియు డు నందరికి దగినవాని నొసగువాడు ||దేవుడు||

  1. అన్నవస్త్రములనే గాక యన్నిటిని నిచ్చువాడు మన్ననతో బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలగువాడు ||దేవుడు||

  2. కష్టబాధలందు మనల గనికరముతో గాచువాడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాడు ||దేవుడు||

Post a Comment

కొత్తది పాతది