603
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పొంది యున్న మేలు లన్నియు బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వ వలయు నందముగను రవినిబోలి నలయకుండ మెలయకుండ ||క్రొత్త||
మేలు సేయ దడ వొనర్పగా మీరెఱుగునట్లు కాలమంత నిరుడు గడ చెగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయు జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకు ||క్రొత్త||
బలము లేని వార మయ్యును బల మొంద వచ్చు గలిమి మీఱ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండ ||క్రొత్త||
ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొంద జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధ జేయ శుద్ధు లైన వారిలో ప్ర సిద్ధు లగుచు వెలుగ వచ్చు ||క్రొత్త||
పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు జూరి మీరు వే డ గా నేపుమీఱ దనదు కరుణ బాప మంత గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధి జేయు ||క్రొత్త||
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన
إرسال تعليق