ఘనదేవ ప్రియ తనయుండా

602

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||

  1. అధిక ప్రేమలొసగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకు జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||

  2. అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతో గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||

  3. దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో భావమందున నీపదంబుల సేవ బాగుగ జేయుచున్ నీ జీవజల వాక్యంబులన్ ధర ధీరతను బ్రకటింప జేయుము ||ఘనదేవ||

  4. పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర ప్రియుల సమితిని మరియు జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||

  5. కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబల జేయుమా సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా పరమార్ధములు బా లురకు గరవుచునుండ జేయుము ||ఘనదేవ||

  6. భాసురంబుగ పరలోక ప్రకాశుడా

Post a Comment

أحدث أقدم