598
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రక్త మంతయు జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలగి పోవునండి ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||
- బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు నమ్ముండి హద్దు మిరుచు ద్రాగువారికి గొద్దికాలమె జీవమండి శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||
- మచ్చునకును త్రాగబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు వీడుండీ హెచ్చుగా దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి చచ్చుటకు నిది హేతువని మది గచ్చితముగను దెలిసికొనుడి ||మద్య||
- ఆలుబిడ్డల మేలుగోరుండి ప్రియులారా వారి మేలు గోరిన ద్రాగం బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుడి కాలయాపన జేయకుండి కర్త యేసని నమ్ముకొనడి ||మద్య||
- ఘన ధనములు నిలువబోవండి ప్రియులార నీచ తనము మీకు మూల మౌనండి తనవిదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు నండి ఘనముగా బ్రభువాక్యసారము వినయ
إرسال تعليق