సద్భక్తితోడ సాక్షులై

500

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందు వారి జూడగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! జేయుపోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వ మందు జీవకాంతియు హల్లెలూయా!ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వుల బోలి యుద్ధ మాడుడీ జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా!ఓ దివ్యసభ! స్నేహభావులు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా!మోక్షంబు జేరి భక్తు లెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ గీతితో గీర్తింతురు హల్లెలూయా!

Post a Comment

కొత్తది పాతది