ఎంతదూరము మోయించెదరు

638

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత||

  1. ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||

  2. సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత||

  3. కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంత||

  4. పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత||

  5. ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||ఎంత||

  6. కలువరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత||

  7. యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||ఎంత||

Post a Comment

أحدث أقدم