Prabhu yesuni vadhanamulo na devudu kanipinche ప్రభుయేసుని వదనములో నాదేవుడు కనిపించె

Song no: 675
    ప్రభుయేసుని వదనములో – నాదేవుడు కనిపించె (2)
    పాపాత్ములబ్రోచుటకై – కృపలొలికినకలువరిలో (2)
    పరలోకముకై – చిరజీవముకై (2)
    ప్రార్ధించెనునాహృదయం ||ప్రభుయేసుని||

  1. దిశలన్నియుతిరిగితిని – నాపాపపుదాహముతో (2)
    దౌష్ట్యములోమసలుచును – దౌర్జన్యముచేయుచును (2)
    ధనపీడనతో – మృగవాంఛలతో (2)
    దిగాజారితిచావునకు ||ప్రభుయేసుని||

  2. యేసునీరాజ్యములో – భువికేతెంచెడిరోజు (2)
    ఈపాపినిక్షమియించి – జ్ఞాపకముతోబ్రోవుమని (2)
    ఇలవేడితిని – విలపించుచును (2)
    ఈడేరెనునావినతి ||ప్రభుయేసుని||

  3. పరదైసున ఈదినమే – నాఆనందములోను (2)
    పాల్గొందువునీవనుచు – వాగ్ధానముచేయగనే (2)
    పరలోకమేనా – తుదిఊపిరిగా (2)
    పయనించితిప్రభుకడకు ||ప్రభుయేసుని||
أحدث أقدم