హోమ్ 95 byOnline Lyrics List —నవంబర్ 01, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి ||యేసు||ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు ||యేసు||ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు||వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి ||యేసు||వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు||ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను ||యేసు||పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాఁజేతఁ బూనెను ||యేసు||ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు||మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు|| ✍ గొల్లపల్లి నతానియేలు Yesu Kriisthudu Nithya Dhevudu – Earigi Nammudi Manujulaaraa = Moasa Mondhaka Moaksha Pathi Kika – Dhaasulai – Brathukandi Randi || Yesu || Aaru Dhnamula Loapalane – Aakasamu Bhuu Loakamulanu = Praakatamug Chesi Naadu – Prakaasu Daayan Prajna Vanthudu || Yesu || Aadi Purushuni Aadhi Sthree Nika – Hasthamulathoa Nanti Chesenu – Medhnin Phalavanamu Loana – Saadhulai Nivasimpa Nichchenu || Yesu || Vaara Lidhdhapu Dhevu Naajnanu - Koarikalathoa Miiri Nappudu = Gaaradii Pisaacha Thanthramu – Vaari Paramai Paapulairi || Yesu || Viiralandharu Vaari Santhathi – Vere Larii Dharaniloa Dhu – Shkaaryulai Dhevuni Yaajnalu – Miiri Randharu Naraka Paathrulu || Yesu || Eintha Paapa Bharithulai Kaa –Santha Sathyamu Leni Narula = Nenthagaa Preminchenoa Thana – Sontha Praanamu Baliga Pettenu || Yesu || Paapaminchuka Leni Karunaa – Paavanudu Narudaayenu = Saapa Grasthulaina Mana – Saapamulu Thaajetha Buunenu || Yesu || Eannaraani Baadha Londhuchu - Punya Rakthamu Jindhenilanu = Eannandu Niilaati Prema – Vanne Ledhoa Yannalaaraa || Yesu || Manala Paapamu Nundi Baapanu – Manujudai Maranambu Nondhi = Mana Prabhuve Muudava Dhinambu Na – Mahini Lechi Paramu Vellenu || Yesu || ✍ Gollapalli Nathaniyelu akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి