హోమ్Purushotthamu.C 42 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ|| ✍ పురుషోత్తము చౌధరి Thella Vaarina Vela – Thelivondhi Mana Kreesthu – Dhivya Naamamu Paadare – Oa Priyu Laara Dhivasa Rakshana Vedare = Thalli Rommuna Dhaachu – Pilla Reethini Manila Challadhanamuga Raath – Rella Gaachina Vibhuni || Thella || Nidhra Poayina Vela Nikhilaapadhalu Baapi – Nisalanni Gadupu Vibhunin = Bhadhramuga Vina Thinchi - Bhaya Bhakthi Thoa Manamu – Mudhri Thaakshula Gelu – Moadchi Mrokkuchun || Thella || Bhaanududhayambayye – Padhmamulu Vikasille – Gaanamulu Chese Pakshul = Maanasaabdhamu Lalara - Manamu Kalvari Metta Pai Nekku Ninudanedi – Prabhu Chuuchi Vedukan || Thella || Dhittamuga Maanasen –Dhriya Kaaya Soadhanalu – Pattukoni, Yundu Dhinamun = Dhattamuga Mana Naalgu – Thatla Yesuni Karuna Juttukoni Rakshinchu - Subha Madugu Konuchun || Thella || paapa Bhaaramu Manamu – Prabhunipai Nidi Guruni – Paadhamulu Chentha Noragi – Kaapu Kartha Visaala – Karamu Maatuna Daagi – Aapadhala Tholaginchu – Mani Vedu Konuchun || Thella || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి