హోమ్Purushotthamu.C 72 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము|| ✍ పురుషోత్తము చౌధరి Mangalamu Paadare- Kreesthuku Jaya – Mangalamu Paadare – Oa Priyulaara – Mangalamu Paadare = Mangalamu Paadi Dhu – Ssangathini Veedi Prabhu – Sangulanu Guudi Madhi – Ponguchu Chelanguchunu || Mangalamu || Raajulaku Raajani – Dhuuthala Chetha – Puuja Gonu Vaadani - Thejamuna Suuryuniki – Dheepthi Nidu Sadhguna Vi – Raajithuni Saadhu Jana - Raksha Kunu Pakshamuga || Mangalamu || Karuna Gala Vaadani – Paapula Broachu – Birudhu Koni Naadani = Maranamunu Dhaanipari Maarchu Ghana Sakthi Gala – Parama Guru Dithade Mana – Paali Vaadani Subha || Mangalamu || Sangeethamu Paaduchu – Suvaartha Pra – Sangamula Guuduchu = Ningi Kini Bhuumikini- Nithyamuga Nela Dhagu – Srungaarapu Raajunaku – Kshema Magu Aamenani || Mangalamu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి