11
రాగం - కాంభోజి తాళం - ఆదిమేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి ||చూచు||
నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన మైన నీ కృపఁ ||చూచు||
నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||
దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల మా తండ్రి ||చూచు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి